ఒకే వేదిక‌పై టాలీవుడ్ టాప్ హీరోస్..!

Thu,April 25, 2019 12:14 PM
NTR, Mahesh Babu and Ram Charan on same stage

టాలీవుడ్ టాప్ హీరోస్ మ‌హేష్ బాబు , ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల మ‌ధ్య ఫ్రెండ్షిప్ బాండ్ ఈ మ‌ధ్య కాలంలో మ‌రింత బ‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌కి ముఖ్య అతిధిగా హాజ‌రైన ఎన్టీఆర్ ఇప్పుడు మ‌హేష్ తాజా చిత్రం మ‌హ‌ర్షి ప్రీ రిలీజ్‌కి కూడా హాజ‌రు కానున్నార‌ని చెబుతున్నారు. మ‌హర్షి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో మే 1న జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. ఈ వేడుక‌కి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజ‌రు కావడం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఒక‌వేళ ఎన్టీఆర్ హాజ‌రు కాని ప‌క్షంలో రామ్ చ‌ర‌ణ్ అయిన ఈ కార్య‌క్ర‌మానికి చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు అవుతార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు మ‌హ‌ర్షి చిత్రం మ‌హేష్ 25వ చిత్రం కావడంతో, ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌కి మహేశ్‌తో ఇప్పటివరకు నటించిన 24 సినిమాల దర్శకుల‌ని ఆహ్వానించ‌నున్న‌ట్ట‌టు తెలుస్తుంది. మ‌రి దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. మ‌హ‌ర్షి చిత్రం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ చిత్రాన్ని మే 9న విడుద‌ల చేయ‌బోతున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించింది. అల్ల‌రి న‌రేష్ .. మ‌హేష్ స్నేహితుని పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు.

1732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles