‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్ విడుద‌ల‌

Sat,February 16, 2019 06:03 PM
NTR Mahanayakudu Trailer Launched

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటించారు. ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా రూపొందించగా తొలి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' సంక్రాంతికి విడుదలైంది. రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఎన్టీఆర్ మహానాయకుడు' ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఎన్టీఆర్ రాజకీయ చరిత్ర, ఆయన జీవితంలో ఎదురైన ముఖ్య ఘట్టాలను రెండో భాగంలో చూపించనున్నారు. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ 'యూ' సర్టిఫికెట్ కూడా పొందింది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్, విద్యాబాల‌న్‌ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఎం.ఎం కీర‌వాణి సంగీతం అందించారు. నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్‌బీకే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై ఎన్టీఆర్ సినిమాను నిర్మించారు.

3672
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles