ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు మేకింగ్ వీడియో

Tue,February 26, 2019 10:26 AM
NTR Mahanayakudu Movie Exclusive Making Video

దివంగ‌త న‌టుడు ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో క్రిష్ రెండు భాగాలుగా ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. తొలి పార్ట్ క‌థానాయ‌కుడు పేరుతో సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కాగా, రెండో పార్ట్ మ‌హానాయ‌కుడు పేరుతో ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌లైంది. ఎన్టీఆర్‌లోని మంచిని మాత్రమే చూపించారంటూ తొలిభాగంపై వచ్చిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండో భాగంలో ఆయనకు ఎదురైన కొన్ని పరాభవాల్ని ప్రస్తావించారు క్రిష్. ఎన్టీఆర్, బసవతారకం మధ్య ఉన్న అనుబంధమే ప్రధాన కథాంశం అంటూ ప్రారంభంలో చిత్రబృందం చెప్పిన మాటలకు సినిమా కథకు ఎలాంటి సంబంధం కనిపించదు. కేవలం నాదెండ్ల భాస్కర్‌రావుపై ఎన్టీఆర్ చేసిన పోరాటానికే పెద్దపీట వేస్తూ సినిమాను రూపొందించారు. నాదెండ్ల భాస్కర్‌రావును విలన్‌గా చూపించడానికే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. ఎన్టీఆర్ జీవితంలో చివరి అంకాన్ని పూర్తిగా విస్మరించారు. తాజాగా చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితానికి సంబంధించిన అంశాలు చూపించారు. మీరు ఈ మేకింగ్ వీడియోపై ఓ లుక్కేయండి.

941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles