నేటి నుండి షూటింగ్‌లో పాల్గొన‌నున్న ఎన్టీఆర్‌

Sat,September 1, 2018 09:04 AM
ntr joins theteam from today

జూనియ‌ర్ ఎన్టీఆర్ తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయ‌న మృతితో జూనియ‌ర్, క‌ళ్యాణ్ రామ్‌లు పుట్టెడంత దుఃఖంలో ఉన్నారు. దీంతో వారు కొన్నాళ్ళు షూటింగ్‌కి బ్రేక్ ఇస్తార‌ని అంతా అనుకున్నారు. కాని త‌మ వ‌ల‌న నిర్మాత‌లు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని భావించి నేటి నుండి ఎన్టీఆర్ అర‌వింద స‌మేత చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నాడు. ఇక క‌ళ్యాణ్ రామ్ సోమ‌వారం సెట్స్‌లోకి అడుగుపెట్ట‌నున్నాడు. కెమెరామేన్‌ కేవీ గుహన్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ ఓ థ్రిల్లర్‌ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మ‌న‌సులో ఎంతో బాధ ఉన్నా కూడా దానిని దింగ మింగుకొని వెంట‌నే షూటింగ్‌లో పాల్గొనాల‌ని అనుకోవడం చూస్తుంటే వారిలో ఎంత నిజాయితీ ఉందో అర్ధ‌మ‌వుతుంది. ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

6320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS