లక్ష్మీస్ ఎన్టీఆర్: ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది

Fri,January 18, 2019 07:09 PM
ntr first look in Lakshmis NTR

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. అయితే ఇప్పటి వరకు లక్ష్మీ పార్వతి, చంద్రబాబు పాత్రలకు సంబంధించిన న‌టుల‌ను పరిచయం చేసిన వర్మ తాజాగా.. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు. ఇవాళ సాయంత్రం 5 గంటలకే రిలీజ్ చేయాల్సి ఉన్నా... ఎన్టీఆర్‌కు ఉన్న విశ్వాసాల మీద గౌరవంతో ఆయన లక్కీ నెంబర్ 9 కలిసే విధంగా సాయంత్రం 6.57 గంటలకు లక్ష్మీస్ ఎన్టీఆర్‌లోని ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశాడు వర్మ. వెన్నుపోటు ద్వారా చంపబడిన ఎన్టీఆర్ మళ్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపంలో బతికి వ‌చ్చారంటూ వర్మ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశాడు.

అయితే.. ఎన్టీఆర్ పాత్రను పోషించిన వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు వర్మ. రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను జీవీ ఫిలింస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే సినిమాలోని రెండు పాటల్ని వర్మ రిలీజ్ చేశాడు.







5806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles