ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి గురైన మ‌హేష్‌

Tue,November 13, 2018 10:20 AM
ntr fans fire on mahesh babu

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల మ‌ధ్య ఎంత‌టి స‌ఖ్య‌త‌ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌హేష్ న‌టించిన భ‌ర‌త్ అనే నేను మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌కి ముఖ్య అతిధిగా వెళ్ళిన ఎన్టీఆర్ ఆ త‌రువాత పలు మార్లు మ‌హేష్‌ని క‌లిసాడు. రెగ్యుల‌ర్‌గా వీరు ఫోన్ టచ్‌లో కూడా ఉంటున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ మ‌ధ్య మంచి సినిమాల‌పై త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శంస‌లు కురిపిస్తున్న మ‌హేష్‌.. ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత‌కి సంబంధించి ఒక్క ట్వీట్ కూడా చేయ‌లేదు . దీంతో మ‌హేష్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండి ప‌డుతున్నారు.

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం పొలిటికల్ డ్రామాగా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింద‌ని, మురుగదాస్ ట్రేడ్ మార్క్ ఫిల్మ్ 'సర్కార్' అంటూ ట్వీట్ ద్వారా తెలిపాడు మ‌హేష్ . అయితే ఎక్కడో అనువాద చిత్రం 'సర్కార్'‌కు స్పందించిన మహేశ్, తెలుగు చిత్రం అర‌వింద‌ స‌మేత‌పై ఎందుకు ట్వీట్ చేయ‌లేదు అంటూ తార‌క్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. మ‌రి ఈ వివాదంపై మ‌హేష్ ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి. మ‌హేష్ ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మ‌హ‌ర్షి చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

3779
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles