ఆ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎన్టీఆర్‌

Sun,October 14, 2018 11:32 AM
ntr creates new record in overseas

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం అర‌వింద స‌మేత‌. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇంటా బ‌య‌టా రచ్చ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా ఓవ‌ర్సీస్‌లోను ఈ మూవీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు అభిమానులు. ఓవ‌ర్సీస్‌లో అరవింద సమేత ఇప్పటి వరకు దాదాపు 1.7 మిలియన్‌ డాలర్ల (12 కోట్ల 50 లక్షల) వసూళ్లు సాధించింది. గ‌తంలోను ఎన్టీఆర్ న‌టించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌, జై లవ కుశ సినిమాలు కూడా 1.5 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా తాజాగా అరవింద సమేతతో మరోసారి అదే రికార్డ్‌‌ అందుకున్నాడు. ఈ ఘ‌న‌త సాధించిన తొలి తెలుగు హీరో ఎన్టీఆరే కావటం విశేషం. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించ‌గా, ఈషా రెబ్బా, న‌వీన్ చంద్ర‌, సునీల్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించారు.

6681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles