బిగ్ బాస్ ఫైన‌ల్‌లో ఇద్ద‌రు స్టార్ హీరోలు..

Thu,September 20, 2018 09:30 AM
ntr chief guest for bigg boss finale

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్ర‌స్తుతం నాని హోస్ట్‌గా సీజ‌న్ 2 న‌డుస్తుండ‌గా, వ‌చ్చే వారం ఈ కార్య‌క్ర‌మానికి పులిస్టాప్ ప‌డ‌నుంది. 17 మంది కంటెస్టెంట్స్‌తో మొద‌లైన ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌స్తుతం కేవ‌లం ఆరుగురు స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. ఒక‌రు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఎంతో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న ఈ కార్య‌క్ర‌మం ఫైన‌ల్‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని నిర్వాహ‌కులు భావిస్తుండగా, కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా నాగార్జున‌ని ఆహ్వానించిన‌ట్టు ఇదివ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. ఇక తాజాగా బిగ్ బాస్ సీజ‌న్1 కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి కార్య‌క్ర‌మాన్ని ఎంతో ర‌క్తి క‌ట్టించిన ఎన్టీఆర్ కూడా ఫినాలేకి హాజ‌రు కానున్నాడ‌ని అంటున్నారు. ఇటీవ‌ల బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఎన్టీఆర్ క‌లిసి ఈ విష‌యంపై మాట్లాడ‌గా, ఆయ‌న అంగీకారం తెలిపాడ‌ని అంటున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే ఒకే వేదిక‌పై నాని, నాగార్జున‌, ఎన్టీఆర్‌ల సంద‌డి బుల్లి తెర ప్రేక్ష‌కులకి ఏ రేంజ్‌లో వినోదాన్ని అందిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

4233
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS