ఎన్టీఆర్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ ఇలా

Sat,May 20, 2017 01:00 PM
ntr birthday celebrations with family

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియ‌ర్ బ‌ర్త్ డే రోజు కోసం ఆశ‌గా ఎదురు చూశారు. ఆ రోజు రానే వ‌చ్చింది. అభిమానులు ఒక‌వైపు ఎన్టీఆర్ పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటే మ‌రో వైపు ఎన్టీఆర్ సోద‌రుడు, జై ల‌వ‌కుశ చిత్ర నిర్మాత‌ క‌ళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కి ఒక రోజు ముందుగానే భారీ ట్రీట్ ఇచ్చాడు. సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్స్ ని విడుద‌ల చేసి ఫ్యాన్స్ లో ఆనందాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్ళాడు. ఇక మ‌క్కినేని సుధాక‌ర్ అనే నిర్మాత ఎన్టీఆర్ 29 వ సినిమాను నిర్మించ‌నుండ‌గా, ఆయ‌న కూడా ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌డం విశేషం.

ఎన్టీఆర్ ఈ సారి కూడా త‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌ను కుటుంబ స‌భ్యుల‌తో జ‌రుపుకున్నాడు. నిన్న రాత్రి జ‌రిగిన వేడుక‌లో త‌న కొడుకు అభిరామ్ క‌ళ్ళు మూసాడ‌ని.. ఎందుకు అలా చేశాడో తెలియ‌దంటూ ట్వీట్ చేశాడు. ఇక త‌న భార్య ప్ర‌ణ‌తి, కుమారుడు అభ‌య్ లు ఫోన్ లో ఏదో చూపించి స‌ర్ ప్రైజ్ ఇచ్చార‌ని యంగ్ టైగ‌ర్ ట్వీట్ చేశాడు. నాన్న‌కు ప్రేమ‌తో చిత్రం త‌ర్వాత త‌న బాధ్య‌త చాలా పెరిగింద‌ని భావిస్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీతోనే ఎక్కువ టైం కేటాయిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక అభిమానుల‌కు, వెల్ విష‌ర్స్ అంద‌రికి ఈ బ‌ర్త్ డే సంద‌ర్బంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు ఎన్టీఆర్.






2843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles