'ఎన్టీఆర్' ట్రైల‌ర్ రిలీజ్‌కి టైం ఫిక్స్

Thu,December 13, 2018 08:16 AM
NTR Biopic Trailer time fixed

దివంగ‌త న‌టుడు ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఎన్టీఆర్‌. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్బీకే ఫిల్మ్స్ ,వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం క‌థానాయకుడు పేరుతో జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుండ‌గా, మ‌హానాయ‌కుడు పేరుతో జ‌న‌వ‌రి 24న రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు మేక‌ర్స్‌.ఇప్పటికే చిత్రానికి సంబంధించి రెండు సాంగ్స్ విడుద‌ల చేసిన టీం ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 16న హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక డిసెంబరు 21న నిమ్మకూరులో ఆడియో విడుదల వేడుకను ఘనంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. కీర‌వాణి స్వ‌రాలు స‌మాకూరుస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబు నాయుడుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యా మేనన్‌, ప్రభగా శ్రియ కనిపించనున్నారు.

1766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles