ఎన్టీఆర్ బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

Thu,January 18, 2018 04:02 PM
ntr biopic first look released

విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ సంగ‌తి తెలిసిందే. బాలయ్య ప్రధాన పాత్రలో రూపొందనున్న ఎన్టీఆర్ బయోపిక్ ని తేజ తెరకెక్కించనుండ‌గా, ఈ మూవీకి ఎన్టీఆర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఊహించిన‌ట్టుగానే తేజ తెర‌కెక్కించ‌నున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి ఎన్టీఆర్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫ‌స్ట్ లుక్ వదిలారు. ఈ రోజు నంద‌మూరి తార‌క‌రామారావు 23వ వ‌ర్థంతి కాగా, ఈ సంద‌ర్భాన్ని పురస్క‌రించుకొని చిత్ర ఫ‌స్ట్ లుక్ వదిలారు. అస‌లు టీజ‌ర్ వ‌స్తుంద‌ని అంతా భావించిన‌ప్ప‌టికి , మూవీ యూనిట్ ఫ‌స్ట్ లుక్‌తోనే సంతృప్తి ప‌రిచింది. వాహనంపై నిలబడి చేతిలో మైక్‌ పట్టుకున్న స్టిల్‌ని ఫ‌స్ట్ లుక్‌గా విడుద‌ల చేశారు. ఇక పోస్ట‌ర్‌పై ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా జీవించిన ఓ మహానుభావునికి ఇదే మా నివాళి..’ అన్న క్యాప్షన్‌ ఆకట్టుకుంటోంది. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంద‌నున్న ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా సంభాష‌ణ‌ల‌ని అందించ‌నుండ‌గా, కీర‌వాణి స్వ‌రాలు స‌మ‌కూర్చ‌నున్నాడు. విష్ణు ఇందూరి, సాయి కొర్ర‌పాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. బాల‌య్య ప్ర‌ధాన‌ పాత్ర‌లో తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్ లో క‌ళ్యాణ్ రామ్ త‌న‌యుడు కూడా న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే కాస్ట్ అండ్ క్రూకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

2783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles