రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో ప్రీ క్రిస్మ‌స్ పార్టీకి హాజ‌రైన ఎన్టీఆర్‌

Fri,December 15, 2017 10:05 AM
రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో ప్రీ క్రిస్మ‌స్ పార్టీకి హాజ‌రైన ఎన్టీఆర్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్‌- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్వ‌ర‌లో ప్ర‌తిష్టాత్మ‌క మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్నాడు. ఇటీవ‌ల వీరు ముగ్గురు క‌లిసి దిగిన ఫోటో షేర్ కావ‌డంతో మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అంశం వెలుగులోకి వచ్చింది. అయితే ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌ని ఒకే స్క్రీన్‌పై చూడనున్నార‌నే టాక్ అభిమానుల‌లో ఫుల్ ఎనర్జీని నింపింది. క‌ట్ చేస్తే ఎన్టీఆర్ రీసెంట్‌గా రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో ప్ర‌త్యక్షం కావ‌డంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది. చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న .. విస్త‌రాకుల‌తో క్రిస్మ‌స్ చెట్టు త‌యారు చేసి, ప్రీ క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రిపింది. ఈ వేడుక‌ల‌కి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు యంగ్ హీరో శ‌ర్వానంద్‌, అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ విష‌యాన్ని ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ క్రిస్మస్ ట్రీని విస్తరాకులతో నేనే తయారు చేశా. మిస్టర్‌ ‘సి’తో ఉన్న వ్యక్తులను గుర్తు పట్టగలరా?’ అని కామెంట్ పెట్టింది.5119

More News

VIRAL NEWS