ఎన్‌టీఆర్‌, ఏఎన్ఆర్ ఒకే ఫ్రేములో.. మ‌రో పోస్ట‌ర్‌ విడుద‌ల‌..!

Thu,September 20, 2018 04:33 PM
ntr and anr in one frame another poster launched ntr biopic

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఎన్‌టీఆర్ చిత్రంలోనుంచి ఈ రోజు ఉద‌యం ఏఎన్ఆర్ ఫ్ట‌స్ లుక్‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. అక్కినేని జ‌యంతి సంద‌ర్భంగా ఆ పోస్ట‌ర్‌ను లాంచ్ చేశారు. ఎన్‌టీఆర్ చిత్రంలో ఏఎన్ఆర్‌గా ఆయ‌న మ‌న‌వ‌డు సుమంత్ న‌టిస్తున్నారు. అయితే ఏఎన్ఆర్ లుక్‌లో ఉన్న సుమంత్‌, ఎన్‌టీఆర్ లుక్‌లో ఉన్న బాల‌కృష్ణ‌లు ఇద్ద‌రూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న మ‌రో పోస్ట‌ర్‌ను కూడా చిత్ర యూనిట్ కొంత సేప‌టి క్రిత‌మే విడుద‌ల చేసింది.

కాగా అక్కినేని అభిమానుల‌తోపాటు నంద‌మూరి ఫ్యాన్స్‌ను కూడా ఈ పోస్ట‌ర్ అల‌రిస్తోంది. ఎన్‌టీఆర్ బ‌యోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్‌టీఆర్ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి లతో కలిసి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్‌గా బాల‌య్య‌, చంద్ర‌బాబుగా రానా లుక్స్ మాత్ర‌మే విడుద‌ల కాగా తాజాగా ఏఎన్ఆర్ లుక్‌తో ఫ్యాన్స్‌లో మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేసింది చిత్ర యూనిట్‌..!

11932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS