'అ' సెంటిమెంట్ వైపే మొగ్గు చూపుతున్న త్రివిక్ర‌మ్

Sat,May 19, 2018 01:22 PM
ntr 28 movie title leaked

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ పోస్ట‌ర్ సాయంత్రం 4.50ని.ల‌కి విడుద‌ల చేయ‌నున్నారు. అయితే కొద్ది గంట‌ల‌లో రివీల్ కానున్న టైటిల్‌కి సంబంధించి అసామాన్యుడు, సింహా నంద‌, రారా కుమారా అంటూ ప‌లు పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే తాజాగా మ‌రో పేరు ఫిలిం స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అర‌వింద స‌మేత రాఘ‌వ అనే టైటిల్‌ని చిత్రానికి క‌న్‌ఫాం చేశార‌ని అంటున్నారు. గ‌తంలో అ అనే అక్ష‌రంతో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అత‌డు, అత్తారింటికి దారేది, అ..ఆ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో త్రివిక్ర‌మ్ త‌న తాజా చిత్రానికి అ పేరుతో ఉండే టైటిల్‌నే క‌న్‌ఫాం చేశాడ‌ని అంటున్నారు. చిత్రంలో రాఘ‌వ పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపిస్తాడ‌ని, అర‌వింద పాత్ర‌లో పూజా హెగ్డే సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం. మ‌రి దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా చిత్రం విడుద‌ల కానుంది.

2615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles