అన్నీ చూపించాను.. ఇక దాచింది ఏముంది?

Sun,August 12, 2018 06:47 PM
Nothing whitewashed shown everything says Rajkumar Hirani on Sanju

బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ బయోపిక్ సంజూపై విమర్శలు రావడాన్ని ఆ మూవీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ తప్పుబట్టాడు. అతని జీవితంలో జరిగిన అన్ని సంఘటనలను ఉన్నదున్నట్లుగా తాను చూపించానని, ఏదీ దాచి పెట్టలేదని స్పష్టంచేశాడు. అతడు 1993 పేలుళ్ల సమయంలో తన దగ్గర ఓ గన్ పెట్టుకున్నాడు. దానిని సినిమాలో చూపించాం. ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించిందీ చూపించాం. అది తన తప్పిదమని సంజయ్ చెప్పాడు. ఇక నేను దాచింది ఏముంది? అదే నాకు అర్థం కావడం లేదు అని హిరానీ అన్నాడు. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో సంజూ మూవీ ప్రదర్శన కోసం హిరానీ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మూవీపై వస్తున్న విమర్శలపై అతడు ఘాటుగా స్పందించాడు.

నేనేదో దాచిపెట్టానని అంటున్నారు. నేను దాచింది ఏముంది? అతనికి 308 మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నట్లు చూపించాను. డ్రగ్స్ వాడినట్లు, తన స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్‌తోనే పడుకున్నట్లు కూడా చూపించాను. ఇక దాచిందేముంది అని హిరానీ ప్రశ్నించాడు. ఒకవేళ ఏదైనా దాచాలని తాను అనుకొని ఉంటే.. అతన్ని మహాత్మా గాంధీ స్థాయిలో చూపించేవాడినని అన్నాడు. అతన్ని గొప్పగా చూపించామంటున్నారు. ఏం గొప్పగా చూపించాను. తన ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌తో పడుకోవడమా.. తన దగ్గర తుపాకీ పెట్టుకోవడమా, డ్రగ్స్ తీసుకోవడమా అని హిరానీ అన్నాడు.

8789
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS