రాజకీయాల్లోకి ప్రముఖ నటుడు

Wed,July 11, 2018 06:15 PM
noted bollywood actor plans to enter politics

ముంబై: పలు హిట్ సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ నటుడు రితేశ్‌దేశ్‌ముఖ్. ప్రస్తుతం అక్షయ్‌కుమార్ తో హౌజ్‌ఫుల్ 4 సినిమాలో నటిస్తున్నాడు రితేశ్. ఈ యాక్టర్ మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడనే విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. రితేశ్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రితేశ్ రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలోని లాతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ఎలాంటి ప్రకటన రాలేదు. మరి దీనిపై త్వరలో స్పష్టత వస్తుందో చూడాలి.

4588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles