రాజ‌కీయాల‌పై క్లారిటీ ఇచ్చిన అక్ష‌య్ కుమార్‌

Mon,April 22, 2019 03:02 PM

హైద‌రాబాద్‌: ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డం లేద‌ని ఫిల్మ్‌స్టార్ అక్ష‌య్ కుమార్ స్ప‌ష్టం చేశారు. అక్ష‌య్ రాజ‌కీయాల్లో ప్ర‌వేశిస్తున్నార‌ని ఊహాగానాలు రావ‌డంతో బాలీవుడ్ స్టార్ ఈ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఉద‌యం అక్ష‌య్ ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. గ‌తంలో ఎన్న‌డూ చేయ‌లేదు, ఇప్పుడు కొంత ఉద్విగ్నంగా ఉంద‌ని ఓ ట్వీట్ చేశారు.దాంతో అక్ష‌య్ రాజ‌కీయంపై రూమ‌ర్లు స్టార్ట్ అయ్యాయి.మోదీ ప్ర‌భుత్వానికి అక్ష‌య్ మ‌ద్ద‌తు ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఊహాగానాలు మరీ శృతిమించ‌డంతో మ‌ళ్లీ ఓ ట్వీట్ చేశారు. ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.1208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles