నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ప్రచారం కూడా చేయను!

Thu,March 21, 2019 04:33 PM
Not contesting in Elections says Salman Khan

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతి పార్టీ తమ స్టార్ క్యాంపేనర్ల కోసం చూస్తుంటుంది. కాస్త సినీ గ్లామర్ అద్దడానికీ ప్రయత్నిస్తుంటుంది. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను కూడా తమ ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. తమ వినతిని సల్మాన్ కచ్చితంగా కాదనడు అని ఆ పార్టీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది కూడా చెప్పారు. ఇప్పటికే తమ నేతలు సల్మాన్‌తో మాట్లాడారని, అతను తమకు ప్రచారం చేస్తాడన్న విశ్వాసం ఉన్నదని అన్నారు. అయితే సల్మాన్ మాత్రం వాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఏ పార్టీ తరఫునా ప్రచారం కూడా చేయనని స్పష్టం చేశాడు.


అయితే ఓటింగ్ శాతాన్ని పెంచేలా ఓటర్లను ప్రోత్సహించాలని కొన్ని రోజుల కిందట ప్రధాని మోదీ సెలబ్రిటీలకు చేసిన ట్వీట్‌ను గురువారం సల్మాన్ రీట్వీట్ చేశాడు. ప్రభుత్వ ఏర్పాటులో అందరూ భాగస్వాములు కావాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సల్మాన్ కోరాడు.

3251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles