వారం రోజులుగా నిద్ర పోలేదు!

Wed,October 18, 2017 04:12 PM
వారం రోజులుగా నిద్ర పోలేదు!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ లేటెస్ట్ మూవీ సీక్రెట్ సూపర్‌స్టార్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే సెలబ్రిటీల నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా మ్యూజిక్‌పై ఉన్న ఆసక్తితో ఓ అమ్మాయి స్టార్ సింగర్‌గా ఎలా ఎదుగుతుందన్నది సినిమా స్టోరీ. అయితే ఈ మూవీ రిలీజ్ ఆమిర్‌ను ఎన్నడూలేనంత టెన్షన్‌కు గురి చేస్తున్నది. దంగల్‌తో తనతోపాటు నటించిన జైరా వసీమ్ ఈ మూవీలో లీడ్ రోల్‌లో కనిపిస్తున్నది. అయితే సినిమాపై ప్రేక్షకుల టాక్ ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో వారం రోజులుగా నిద్ర కూడా పోలేదని ఆమిర్‌ఖాన్ ట్వీట్ చేశాడు. రేపు మూవీ రిలీజ్ కాగానే.. ఎలా ఉందో చూసి చెప్పండంటూ ఆమిర్ ట్వీట్ చేశాడు.


2668
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS