స్టార్ కాదు.. నటిని అవ్వడం కోసం ప్రయత్నిస్తున్నా: జాన్వీ

Sun,July 22, 2018 06:16 PM
Not a star just trying to be an actor says Janhvi Kapoor

బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ధడక్ రీసెంట్‌గా రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినీ అభిమానులు శ్రీదేవిని తన కూతురులో చూసుకుంటున్నారు. జాన్వీ నటన కూడా అద్భుతంగా ఉందని పొగుడుతున్నారు. అయితే.. ధడక్ మూవీ యూనిట్ నిన్న ముంబైలోని గైటీ గెలాక్సీ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ మూవీ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందామని వెళ్లారు. అక్కడ మీడియా జాన్వీని పలకరించింది. అప్పుడు జాన్వీ ఎంతో పరిణతి చెందిన వ్యక్తిలా.. స్టార్ అవ్వడం కాదు.. ముందు మంచి నటిని అవ్వడం కోసం ప్రయత్నిస్తున్నా అని చెప్పింది. ఇక.. ధడక్ మూవీ ఓపెనింగ్ కలెక్షన్లు రూ.8.71 కోట్లు కాగా.. డెబ్యూ సినిమాల్లో ఈ తరహా ఓపెనింగ్స్ రావడం రికార్డు. 2016లో వచ్చిన మరాఠీ మూవీ సైరట్‌కు రిమేకే ఈ మూవీ.

5417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles