ఏవీల‌తో క‌న్నీరు పెట్టించిన బిగ్ బాస్

Fri,September 28, 2018 08:50 AM
Nostalgia Hits Hard in bigg boss

బిగ్ బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మం తుది ద‌శ‌కు చేరుకోవ‌డంతో ఇంటి స‌భ్యుల‌లో ఆనందం నింపేందుకు వారికి ఎన్నో స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. 17 మంది కంటెస్టెంట్స్‌తో మొద‌లైన ఈ కార్య‌క్ర‌మంలో చివ‌రికి ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్ర‌మే మిగిలారు. వీరిలో ఒక‌రు బిగ్ బాస్ టైటిల్ అందుకోనున్నారు. అయితే వీరు వంద రోజులకి పైగా ప్ర‌యాణాన్ని బిగ్ బాస్ హౌజ్‌లో చేశారు. ఈ ప్ర‌యాణం ఎంతో ఒడిదుడుకుల‌తో, క‌ష్ట‌న‌ష్టాల‌తో సాగింది. అన్నింటిని భ‌రించి చివ‌రికి ఫినాలే రేసులో నిలిచారు. అయితే వీరి ప్ర‌యాణం ఎలా సాగింద‌నేంది బిగ్ బాస్ ఓ ఏవీ( జ్ఞాప‌కాల వీడియో) ద్వారా చూపించి భావోద్వేగానికి గుర‌య్యేలా చేశారు.

ముందుగా దీప్తి న‌ల్ల‌మోతుని యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్ బాస్ సాధార‌ణ యువ‌తిలా వ‌చ్చి, అంద‌రికి త‌న ప్రేమ‌ని పంచుతూ ఇంట్లో స‌భ్యుల‌తో పాటు బ‌య‌టి వారి ప్రేమ‌ని కూడా గెలుచుకున్నావని తెలిపారు. ఏడుస్తూ, అలుగుతూ, టాస్క్‌ల విష‌యంలో ఎఫోర్ట్ పెడుతూ ఇక్క‌డికి వ‌ర‌కి చేరుకున్నారు అంటే మీ సంక‌ల్పం ఎంత గొప్ప‌దో అర్ధ‌మ‌వుతుంద‌ని బిగ్ బాస్ అన్నారు. ఇక ఆ త‌ర్వాత త‌న ఏవీ ప్లే చేయ‌డంతో త‌న జ‌ర్నీని చూసి దీప్తి చాలా ఎమోష‌న‌ల్ అయింది.

సామ్రాట్ గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ.. అతి త‌క్కువ టైంలో అంద‌రికి ద‌గ్గ‌ర‌య్యారు. మీ బాధ‌లు ప‌క్క‌న పెట్టి మ‌న‌స్పూర్తిగా ఆడుతూ దృఢ‌సంక‌ల్పంతో విజ‌యం సాధించారు. బిగ్ బాస్ శిక్షించేంత‌గా మీరు టాస్క్‌లో ఒదిగిపోయారు. త‌నీష్‌, తేజ‌స్వీల‌తో అంద‌మైన బంధాల‌ని ఏర్ప‌ర‌చుకుంటూ స్నేహానికి కొత్త అర్ధం చెప్పారు. దీని వ‌ల‌న మీకు విమ‌ర్శ‌ల‌తో పాటు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. త‌క్కువ టైంలో స్నేహితులు, కుటుంబ స‌భ్యుల సాయంతో ఉత్సాహంగా గేమ్ ఆడిన మీరు వెన‌క్కి తిరిగి చూసుకోలేదు అని తెలిపారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కి సంబంధించిన ఏవీ ప్లే అయింది.

త‌నీష్ గురించి చెబుతూ.. అతి సులువుగా యాంగ్రీ యంగ్ మెన్ బిరుదు తెచ్చుకున్నారు. కానీ, ప్రేక్షకులకు మీరు వాత్సల్యం, సంరక్షించే ఇంటి సభ్యుడిలా కనిపించారు. మొదటి నుంచి మీకు కొన్ని బంధాలు ఏర్పడ్డాయి. అవి ఎలాంటి వంటే.. స్నేహానికి ఉత్తమమైన ఉదాహరణగా నిలుస్తాయి. మీలా స్నేహానికి కట్టుబడి ఉండటం బ‌హుశా ఈ ఇంట్లో ఇంకెవరికీ తెలీదేమో. బయట సులువుగాఎన్నో వాగ్విదాలకు దిగే తనీష్.. లోపల ఎంతో ప్రేమను పంచేవ్యక్తి అని బిగ్‌బాస్ గమనించారు. టాస్క్‌లో మీ ప్రాణాల‌ని పణంగా పెట్టి ఎలా ఆడ‌తారో మీ స్నేహితుల‌ని అలాగే కాప‌డతారు. మీరు శ్ర‌మ జీవి, నిజాయితీ ప‌రుడు, బ‌ల‌వంతుడు. ఉత్త‌మైన ల‌క్ష‌ణాల‌తో ఉన్న‌త స్థాయికి ఎద‌గాలి అంటూ తనీష్ ఏవీని చూపించారు. చివ‌రిగా కావాలంటే మీ జాకెట్‌ని మీతో తీసుకెళ్లొచ్చ‌ని చెప్పారు . ఈ క్ర‌మంలో తనీష్ భావోద్వేగానికి గురయ్యాడు.

ఇక నేటి ఎపిసోడ్‌లో కౌశ‌ల్‌, గీతా మాధురిల గురించి చెబుతూ వారి ఏవీలు చూపించ‌నున్నారు. దీని కోసం వారిద్ద‌రు చాలా ఆస‌క్తిగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు ప్ర‌సారం కానున్న 111వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌజ్ నుండి వెళ్లి పోయిన పాత హౌజ్‌మేట్స్ మ‌ళ్ళీ ఇంట్లోకి వ‌చ్చి ర‌చ్చ చేయ‌నున్నార‌ట‌. మ‌రి నేటి ఎపిసోడ్ ఎంత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుందో చూడాలి.

4282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles