చిన్నారుల‌తో నోరా ఫ‌తేహీ డ్యాన్స్.. వీడియో వైర‌ల్

Thu,March 14, 2019 09:29 AM

బాహుబ‌లి చిత్రంలో మ‌నోహ‌రి అనే స్పెష‌ల్‌ సాంగ్ లో త‌న అంద చందాల‌తోనే కాక స్టెప్స్‌తోను అల‌రించిన నోరా ఫ‌తేహీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులో వ‌చ్చిన టెంప‌ర్‌లో ఇట్టాగే రెచ్చిపోదాం అనే పాట‌కి డ్యాన్స్ వేసి అల‌రించిన నోరా రవితేజ ‘కిక్‌-2’ టైటిల్‌సాంగ్‌లోను స్టెప్పులేసింది. ‘షేర్’, ‘లోఫర్’ ‘ఊపిరి’ తదితర చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో న‌ర్తించింది. అయితే ఈ ఇండో- కెనడా మోడల్‌ ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ షేర్ చేస్తూ అభిమానుల‌ని అల‌రిస్తుంటుంది. ఈ సారి చిన్నారుతో డ్యాన్స్ వేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కింది.


నోరా ఫ‌తేహీ ప్ర‌స్తుతం వ‌రుణ్ ధావ‌న్, శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌కుతున్న స్ట్రీట్ డ్యాన్సర్ అనే చిత్రంలో న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ లండ‌న్‌లో జ‌రుగుతుంది. అయితే అదే స‌మ‌యంలో కొంద‌రు చిన్నారుల‌తో తాను స్టెప్పులేసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది నోరా. ఎంతో అంద‌మైన క్ష‌ణాలు. ఇక్క‌డి చిన్నారులు స్ట్రీట్ డ్యాన్స‌ర్ సెట్స్ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి త‌మ ఫ్యామిలీస్‌తో ఫోటోస్ దిగుతున్నారు. అందులో ఒక బాలుడు క‌మ‌రియా పాట‌కి డ్యాన్స్ చేయ‌మ‌ని అడిగాడు. దీనిని ఆనంద‌క్ష‌ణాలుగా భావించిన నేను క‌మ‌రియా పాట‌కి చిన్నారుల‌తో క‌లిసి డ్యాన్స్ చేశాను. ఇలాంటి ఇన్సోసెంట్ కిడ్స్‌తో స‌ర‌దాగా గ‌డ‌ప‌డం క‌న్నా నాకేదీ గొప్ప‌గా అనిపించ‌లేదు. వారు నిజ‌మైన‌, నిజాయితీగ‌ల అభిమానులు. వారి కోస‌మే నేను ఉన్నాను అంటూ ఇన ఇన‌స్టాగ్రామ్ వీడియోకి కామెంట్ పెట్టింది నోరా. స‌ల్మాన్ హీరోగా తెర‌కెక్కుతున్న భార‌త్‌లోను నోరా ఫ‌తేహి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

1118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles