ప్రియా వారియ‌ర్‌పై అక్క‌సు వెళ్ళ‌గ‌క్కిన స‌హ‌న‌టి

Sun,February 24, 2019 08:17 AM
noorin shereef sensational comments on priya

క‌న్నుగీటుతో కోట్లాది ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ‌ని పొందిన న‌టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. ఈ అమ్మ‌డు న‌టించిన తాజా చిత్రం ఒరు ఆదార్ ల‌వ్. ఇందులో క‌న్ను కోట్టే సీన్‌లో న‌టించి రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందింది ప్రియా. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న ఇటు తెలుగు, అటు మ‌ల‌యాళంలో విడుద‌లైంది. అయితే చిత్రానికి పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. దీంతో క్లైమాక్స్‌ని కొంత మార్చి ప్రేక్ష‌కుల‌ని థియేట‌ర్స్‌కి ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్‌తో పాటు నూరిన్ షెరీఫ్, రోషన్ అబ్దుల్ రహూఫీ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో లవర్స్ డే పేరుతో ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

ఒరు ఆదార్ ల‌వ్ చిత్రంలో అస‌లు హీరోయిన్ నూరిన్ షెరీఫ్ కాగా, ప్రియా ప్ర‌కాశ్‌కి వ‌చ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమా స్క్రిప్ట్ అంతా మార్చార‌ట‌. ఈ విష‌యాన్ని నూరిన్ తాజాగా మీడియాకి తెలియ‌జేసింది. అస‌లు చిత్రంలో త‌న‌ది లీడ్ రోల్ కాగా, క‌న్ను కొట్టే సీన్‌తో ప్రియా వారియ‌ర్‌కి అంత‌గా క్రేజ్ రావ‌డంతో క‌థ మొత్తం మార్చేసి నూరిన్ ప్రాధాన్య‌త కూడా త‌గ్గించేశార‌ట‌. లీడ్ రోల్‌ని స‌పోర్టింగ్ రోల్ చేసి, స‌పోర్టింగ్ రోల్‌ని లీడ్ రోల్ చేయ‌డం నాకు చాలా బాధ క‌లిగింది. ఇక మీద‌ట ప్రియా ప్ర‌కాశ్‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ వ‌చ్చిన అస్సలు ఒప్పుకోను. రోష‌న్‌తో మాత్రం న‌టిస్తా. ఒక‌ర‌కంగా ప్రియా వ‌ల‌న నా కెరీర్ చాలా లాస్ అయింది అంటూ నూరిన్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

4076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles