మెగా ఫ్యామిలీ అభిమాని క‌న్నుమూత‌..

Sun,December 8, 2019 11:56 AM

నూర్ మొహమ్మద్..ఈ వ్య‌క్తి మెగా ఫ్యామిలీ అంద‌రికి గొప్ప వీరాభిమాని. అటు చిరంజీవి ద‌గ్గ‌ర నుండి ఇటు వ‌రుణ్ తేజ్ వ‌ర‌కు అంద‌రు హీరోల‌ని ఎంత‌గానో అభిమానిస్తుంటారు. గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఉన్న నూర్ భాయ్ ఈ రోజు అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతితో మెగా ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు ఆయ‌న భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు మ‌రి కొద్ది సేప‌ట్లో మొహమ్మద్ ఇంటికి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది.


నూర్ మొహమ్మద్ మెగా హీరోల పేరుతో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. అభిమానుల మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ‌లు కూడా రాకుండా అంద‌రిని ఏక‌తాటిపై న‌డిపించారు. గ‌త కొద్ది రోజులుగా నూర్ భాయ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతుండ‌గా,ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ ఆసుప‌త్రికి వెళ్లి ఆయ‌న‌ని ప‌రామ‌ర్శించారు. ఆయ‌న మ‌ర‌ణంతో మెగా హీరోల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు కూడా షాక్ లో ఉన్నారు.1828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles