సూర్య‌, స‌త్య‌రాజ్‌ల‌కు అరెస్ట్ వారెంట్

Tue,May 23, 2017 03:11 PM
Non Bailable Warrants against 8 Tamil Actors including Suriya

కోయంబ‌త్తూర్‌: త‌మిళ న‌టులు సూర్య‌, స‌త్య‌రాజ్‌ల‌తోపాటు మ‌రో ఆరుగురికి నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది ఊటీ కోర్టు. ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వేసిన ప‌రువున‌ష్టం కేసుకు సంబంధించి రెండుసార్లు కోర్టుకు హాజ‌రుకాక‌పోవ‌డంతో జ‌డ్జి సెంథిల్‌కుమార్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. సూర్య‌, స‌త్య‌రాజ్‌ల‌తోపాటు మ‌రో సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్‌, చ‌ర‌ణ్‌, విజ‌య్‌కుమార్‌, వివేక్‌, అరుణ్ విజ‌య్‌, సుప్రియ‌ల‌కు ఈ వారెంట్ జారీ అయింది. ఈ కేసు 2009కి సంబంధించిన‌ది. అప్ప‌ట్లో కొంత‌మంది త‌మిళ నటులు వ్య‌భిచారానికి పాల్ప‌డుతున్నార‌ని ఓ న‌టి ఆరోపించిన విష‌యాన్ని ఓ ప‌త్రిక ప‌బ్లిష్ చేసింది. అయితే సినిమా ఇండ‌స్ట్రీ నుంచి నిర‌స‌న రావ‌డంతో ఆ ప‌త్రిక క్ష‌మాప‌ణ కోరింది. కానీ అదే ఏడాది అక్టోబ‌ర్ 7న న‌దిగ‌ర్ సంగ‌మ్ చేసిన ధ‌ర్నాలో ఈ న‌టులు జ‌ర్న‌లిస్టుల‌పై నోరు పారేసుకున్నారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రొజారియో మ‌రియా సుసాయ్ వీరిపై ఊటీ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ కేసును డిస్మిస్ చేయాల్సిందిగా అప్ప‌ట్లోనే ఈ న‌టులంతా మ‌ద్రాస్ హైకోర్టుకు వెళ్లినా.. కోర్టు నిరాక‌రించింది. నిన్న, ఈ రోజు విచార‌ణ జ‌రిపింది ఊటీ కోర్టు. కానీ రెండు సంద‌ర్భాల్లోనూ ఈ న‌టులు కోర్టుకు రావ‌డంతో నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

2795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles