బిగ్ బాస్‌లో వాడివేడిగా జ‌రిగిన నామినేష‌న్ ప్ర‌క్రియ‌

Tue,August 28, 2018 08:43 AM
nominations are very serious on Monday episode

సోమ‌వారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఈ వారం కూడా ప‌ది మంది ఇంటి స‌భ్యుల‌తో నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌రిగింది. ఈ నామినేష‌న్ ప్ర‌క్రియ కోసం బిగ్ బాస్ ప్ర‌తి ఇంటి స‌భ్యుడూ.. ముగ్గురు కంటెస్టెంట్స్‌ని సెల‌క్ట్ చేసుకొని, వారిని యాక్టివిటి ఏరియాలోకి తీసుకెళ్ళి ఒక వ్య‌క్తిని సేవ్ చేసి మిగ‌తా ఇద్ద‌రిని నామినేట్ చేయాల‌ని తెలిపారు. ఇందుకు కార‌ణాలు కూడా చెప్పాల‌ని కోరారు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా ముందుగా నూత‌న్ నాయుడు .. అమిత్, సామ్రాట్‌, కౌశ‌ల్‌ని యాక్టివిటీ ఏరియాలోకి తీసుకెళ్ళి అమిత్‌, సామ్రాట్‌ల‌ని నామినేట్ చేశాడు.కౌశల‌్‌ను సేవ్ చేశాడు. ఆ త‌ర్వాత శ్యామల.. గణేశ్, నూతన్ నాయుడు‌లను నామినేట్ చేసి తనీశ్‌ని సేవ్ చేసింది.

దీప్తి నల్లమోతు.. సామ్రాట్, అమిత్‌లను నామినేట్ చేసి రోల్ రైడాని సేవ్ చేసింది. అమిత్.. నూతన్ నాయుడు, గణేశ్‌లను నామినేట్ చేసి కౌశల్‌ని సేవ్ చేశాడు. గీతా మాధురి.. నూతన్ నాయుడు, కౌశల్‌ని నామినేట్ చేసి అమిత్‌ని సేవ్ చేసింది. సామ్రాట్ .. కౌశల్, నూతన్ నాయుడులను నామినేట్ చేసి శ్యామలను సేవ్ చేశాడు. తనీశ్.. కౌశల్, నూతన్ నాయుడులను నామినేట్ చేసి రోల్‌రైడాని సేవ్ చేశాడు. రోల్ రైడా.. నూతన్ నాయుడు, కౌశల్‌ని నామినేట్ చేసి గణేశ్‌ని సేవ్ చేశాడు. కౌశల్.. గణేశ్, సామ్రాట్‌లను నామినేట్ చేసి, అమిత్‌ను సేవ్ చేశాడు. గణేశ్..అమిత్, కౌశల్‌లను నామినేట్ చేసి గీతా మాధురి‌ని సేవ్ చేశాడు. ఇలా నామినేష‌న్స్ కోసం జ‌రిగిన ప్ర‌క్రియ‌లో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ కౌశల్, నూతన్ నాయుడు, గణేశ్, సామ్రాట్, అమిత్‌లను నామినేట్ చేశారు.

నామినేష‌న్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ స‌మ‌యంలో దీప్తి కెప్టెన్ అయి ఉండి నేను టాస్క్ లో పాల్గొన‌వ‌చ్చా అని ప్ర‌శ్నించేస‌రికి, కెప్టెన్ అయిన కూడా మీకు నామినేషన్ భ‌యం పోలేదా అంటూ చ‌మ‌త్క‌రించాడు. ఇక నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా నూతన్ నాయుడు క‌న్నీటి ప‌ర్యంత అయ్యాడు. మీకు నైతిక‌త లేద‌ని త‌నీష్ అన‌డంతో ఆయ‌న భావోద్వేగానికి గురై క‌న్నీళ్ళు పెట్టుకున్నాడు. నిబద్ధతతోనే తాను గేమ్ ఆడుతున్నట్లు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కౌశల్, రోల్‌రైడా‌లు నూత‌న్‌ని ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇక కౌశల్.. గణేశ్‌ని నామినేట్ చేసే స‌మ‌యంలో స్టార్టింగ్‌లో ఒక‌లా ఉన్న‌ నువ్వు ఇప్పుడు ఒక‌లా ఉన్నావు. నువ్వు హౌస్‌లో సోమరిపోతువు. హౌజ్‌లో గొడ‌వైన‌ప్పుడు కూడా సైలెంట్‌గా కూర్చున్నావు అంటూ గ‌ణేష్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు కౌశ‌ల్‌. దీనికి గ‌ణేష్ త‌న స్టైల్‌లో జ‌వాబిచ్చాడు. అయితే గ‌ణేష్ త‌ను నామినేట్ చేసే స‌మయంలో కౌశ‌ల్‌ని ఎంపిక చేసుకొని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి యుద్ధ‌మే జ‌రిగింది.

ఆ త‌ర్వాత రెనో క్విడ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో దీప్తి సంచాల‌కురాలిగా ఉండ‌గా, ఇంటి స‌భ్యులు రెండు టీంలుగా విడిపోయారు. టీం ఏ త‌ర‌పున అమిత్ రివ‌ర్స్ డ్రైవ్ చేయ‌గా, టీం బీ త‌ర‌పున కౌశ‌ల్ రివ‌ర్స్ లో డ్రైవ్ చేశారు . త‌క్కువ టైం లో టీం బీనే చేరుకున్న‌ప్ప‌టికి టీం బీ వారు రూల్స్ స‌రిగా పాటించ‌లేదని సంచాల‌కురాలు టీం ఏని విజేతగా ప్ర‌క‌టించింది. ఇక పూజా విసిరిన బిగ్ బాంబ్ ప్ర‌కారం గీతా జైలులోనే నిద్రించింది. దీంతో ఎపిసోడ్ 79 ముగిసింది.

4728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles