ఈ వారం నామినేష‌న్‌లో ఎవ‌రు నిలిచారో తెలుసా ?

Tue,August 14, 2018 08:57 AM
nomination selection in Monday episode

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 2 విజ‌యవంతంగా 65 ఎపిసోడ్స్ పూర్తి చేస్తుంది. బిగ్ బాస్ సీజ‌న్ 2..ఇక్కడ ఏదైన జ‌ర‌గొచ్చు అన్న‌ట్టుగానే బిగ్ బాస్‌కి కొన్నాళ్ళుగా ఇంటి పెద్ద‌గా వ్య‌వ‌హరించిన బిగ్గ‌ర్ బాస్ బాబు గోగినేని ఆదివారం ఎపిసోడ్‌లో నిష్క్ర‌మించారు. ఎప్పుడు ఎవ‌రు ఇంటి నుండి వెళ్ళిపోతారో తెలియ‌ని ప‌రిస్తితి . సోమ‌వారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ వినూత్న టాస్క్ ఇచ్చి ఎలిమినేష‌న్ కోసం నామినేష‌న్స్ ఎంపిక చేసే బాధ్య‌త‌ని కెప్టెన్ త‌నీష్‌కి, క‌మ‌ల్ హాస‌న్ ఇచ్చిన స్పెష‌ల్ కార్డ్ ద్వారా సేఫ్ జోన్‌లో ఉంటున్న అమిత్‌కి అప్ప‌జెప్పారు.

నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా ఇంటి స‌భ్యులు అంద‌రు త‌మ‌కి న‌చ్చిన జంటని ఎంపిక చేసుకోవాల‌ని బిగ్ బాస్ తెలియ‌జేశారు. దీంతో త‌నీష్‌, అమిత్‌ల‌ని మిన‌హాయించి మిగ‌తా వారు ఐదు జంటలుగా ఏర్ప‌డ్డారు. వీరు చేయాల్సిందేమంటే గార్డెన్ ఏరియాలో ఉన్న డేంజ‌ర్ డ్ర‌మ్ముల వ‌ద్ద నించొని , బజ‌ర్ మోగిన త‌ర్వాత ఒక్కో జంట నీలం రంగు డ్ర‌మ్ము వ‌ద్ద‌కు వ‌చ్చి త‌ను ఎందుకు నామినేష‌న్‌లో ఉండ‌కూడ‌దో చెప్పాల‌న్నారు. అంతేకాదు త‌నకి జంట‌గా ఉన్న వారు ఎందుకు నామినేష‌న్ కావాలో కూడా వివ‌రించాల‌ని బిగ్ బాస్ చెప్పారు. ఈ ప్ర‌క్రియకి సంచాల‌కులు త‌ర‌హాలో త‌నీష్‌, అమిత్‌లు వ్య‌వ‌హ‌రిస్తార‌ని బిగ్ బాస్ అన్నాడు.

టాస్క్ మొద‌లు కాగానే ముందుగా పూజా రామచంద్ర‌న్‌, సామ్రాట్‌లు బ్లూ క‌ల‌ర్ డ్ర‌మ్ము వ‌ద్ద‌కు వ‌చ్చి తాము ఎందుకు నామినేష‌న్ కాకూడ‌దో వివరించారు. వీరి అభిప్రాయంపై చ‌ర్చించిన త‌నీష్‌, కౌశ‌ల్‌లు సామ్రాట్‌ని సేవ్ చేసి పూజా ని నామినేష‌న్‌కి ఎంపిక చేశారు. ఇక ఆ త‌ర్వాత కౌశ‌ల్‌, గీతా వంతు రాగా వీరిద్ద‌రిలో కౌశ‌ల్‌ని సేవ్ చేసి గీతాని నామినేట్ చేశారు. ఆ త‌ర్వాత రోల్ రైడా, గ‌ణేష్ జంట త‌మ అభిప్రాయాల‌ని తెలియ‌జేశారు. గ‌తంలో గ‌ణేష్ ..రోల్ రైడా కోసం సెల్ఫ్ నామినేట్ చేసుకోవ‌డంతో పాటు వారం రోజులు ప్రూట్స్ తినుకుంటూ ఉన్నాడు. ఇందుకు కృత‌జ్ఞ‌త‌గా రోల్ ఈ సారి త‌న‌కి తాను నామినేట్ చేసుకొని గ‌ణేష్‌ని సేవ్ చేశాడు.

ఇక నాలుగో జంట‌గా శ్యామ‌ల‌, దీప్తి సున‌య‌న బ్లూ క‌ల‌ర్ డ్ర‌మ్ ముందుకు వ‌చ్చి ఈ ఇద్ద‌రు తమ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. గేమ్ టాస్క్‌ల‌లో తాను స‌రిగ్గా ప‌ర్‌ఫార్మ్ చేయ‌లేద‌ని ఒప్పుకోవ‌డంతో దీప్తి సున‌య‌న‌ని నామినేట్ చేసి శ్యామ‌ల‌ని సేవ్ చేశారు. అయితే ఈ జంట ఎంపిక ప్ర‌క్రియ‌లో త‌నీష్ ప‌క్క‌కు రావ‌డం విశేషం. చివ‌ర‌గా దీప్తి, నూత‌న్ నాయుడు రాగా.. కంటెస్టెంట్స్ సుదీర్ఘ చర్చ తర్వాత నూతన్ నాయుడ్ని నామినేషన్‌లో నిలిపారు.

మొత్తానికి ఈ వారం ఎలిమినేష‌న్ కోసం నామినేష‌న్‌లో పూజా రామ‌చంద్ర‌న్, గీతా మాధురి, రోల్ రైడా, దీప్తి సున‌య‌న‌, నూత‌న్ నాయుడు ఎంపిక‌య్యారు. అయితే కెప్టెన్‌గా ఉన్న త‌నీష్‌కి స్పెష‌ల్ కోటా కింద సేఫ్ అయిన వారిలో ఒక‌రిని సెల‌క్ట్ చేసే ప‌వ‌ర్ ఇవ్వ‌డంతో త‌నీష్ అన్నీ ఆలోచించి శ్యామ‌ల‌ని ఎంపిక చేశారు. ఈ వారం ఆరుగురు నామినేష‌న్స్‌కి ఎంపిక కాగా వారు తమ‌ని తాము సేవ్ చేసుకునేందుకు ఎలాంటి గేమ్ ప్లాన్ చేసుకొని ప్రొటెక్ట్‌డ్ జోన్‌లోకి వెళ‌తారో చూడాలి.

4500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles