అర‌వింద స‌మేత‌కి ఛీఫ్ గెస్ట్ రానున్నారా ?

Tue,October 2, 2018 12:06 PM
No special guest for Aravinda Sametha event

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల త‌న తండ్రి మ‌ర‌ణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. నిర్మాత‌ల‌కి ఇబ్బంది కలిగించొద్ద‌ని హ‌రికృష్ణ మ‌ర‌ణించిన నాలుగో రోజు నుండే షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం అర‌వింద స‌మేత అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సాయంత్రం నోవాటెల్‌లో జ‌ర‌గ‌నుంది. ప్రీ రిలీజ్ వేడుక‌కి బాల‌య్య లేదా చంద్ర బాబు నాయుడు అతిధులుగా హాజ‌రు కానున్నార‌ని రెండు మూడు రోజుల నుండి విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం చిత్ర యూనిట్ త‌ప్ప ఈ వేడుక‌కి అతిధులుగా ఎవ‌రు హాజ‌రు కావ‌డం లేదని స‌మాచారం. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ అభిమానులు మాత్రం భారీగా హాజ‌రుకానున్నారని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ త‌న తండ్రి మ‌ర‌ణించిన త‌ర్వాత తొలిసారి ప‌బ్లిక్ ముందు మాట్లాడనుండగా, ఇప్పుడు అంద‌రి దృష్టి ఆయ‌న మీదే ఉంది. అభిమానుల‌కి ఎలాంటి విష‌యాలు చెబుతారు. త‌న బాధ‌ని ఫ్యాన్స్‌తో పంచుకుంటారా అనే దానిపై అంత‌టా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అర‌వింద స‌మేత రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో తెర‌కెక్క‌గా ఇందులో పూజా హెగ్డే, ఈషారెబ్బా క‌థానాయిక‌లుగా న‌టించారు. థ‌మ‌న్ సంగీతం అందించారు.

4423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles