సోఫాలో కూర్చున్న సల్మాన్ .. పట్టించుకోని అభిమానులు

Wed,July 18, 2018 03:19 PM
no one found salman in abu dhabi

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం నటనతోనే కాదు సామాజికి సేవా కార్యక్రమాలతోను సల్మాన్ ఎందరో ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నాడు. అయితే తను నటించిన చివరి చిత్రం రేస్ 3 షూటింగ్ లో భాగంగా అబుదాబి వెళ్ళారు సల్మాన్. అక్కడ ఫ్రీ టైంలో బాడీ గార్డ్స్ తో కలిసి మాల్ కి వెళ్ళారు. ఫోన్ చూసుకుంటూ మాల్ లోని ఓ సోఫాలో కూర్చున్నాడు సల్మాన్. అయితే సాధారణ వ్యక్తిలా అతనిని ఎవరు పట్టించుకోకుండా తమ పనులలో బిజీ అయిపోయారు. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. గత నెల సల్మాన్ చిత్రం రేస్ 3 ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ మూవీకి డివైడ్ టాక్ లభించింది. ఆయన గెస్ట్ పాత్ర పోషించిన జీరో విడుదల కావలసి ఉంది. త్వరలో భారత్ అనే చిత్రం చేయనున్నాడు సల్మాన్ . ప్రియాంక చోప్రా ఈ మూవీలో కథానాయికగా నటిస్తుంది.


2800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles