బాహుబలి థియేటర్స్ లో పిల్లలకి నో ఎంట్రీ

Fri,May 19, 2017 03:53 PM
no entry for childrens in baahubali2 theatres

చరిత్ర తిరగాసిన బాహుబలి 2 చిత్రం ఏప్రిల్ 28న విడుదలై ఇటు పిల్లలని, అటు పెద్ద వాళ్ళని కూడా అలరించింది. మూడు వారాలలోనే 1500 కోట్ల కలెక్షన్స్ సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు సృష్టించింది ఈ చిత్రం. మరి ఇంత ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా థియేటర్స్ లోకి ఇప్పుడు పిల్లల కి ఎంట్రీ లేద‌నే వార్త విని ఆశ్చ‌ర్య‌పోతున్నారా .. మీరు విన్నది నిజమే ఈ సినిమాలో ఉన్న రక్తపాతం కారణంగా సింగపూర్ సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేస్తూ 16 ఏళ్ళలోపు పిల్లలను ఆ దేశంలోని బాహుబలి 2 థియేటర్స్ కి అనుమతించమంటూ ఆర్డర్ పాస్ చేసింది. సింగపూర్ లోనే కాదు పలు ఆసియా, యూరప్ దేశాలలోను బాహుబలి2 చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేశారట. మన దగ్గర మాత్రం ఈ చిత్రం యు /ఏ సర్టిఫికెట్ ని దక్కించుకొని అందరిని అలరిస్తుంది.

2523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS