గుజ‌రాతీ చిత్రానికి రీమేక్‌గా నంద‌మూరి హీరో సినిమా

Fri,August 23, 2019 11:13 AM
NKRs Entha Manchivadavuraa remake of Gujarati film

నిర్మాత‌గా, న‌టుడిగా రాణిస్తున్న క‌ళ్యాణ్ రామ్ ఇటీవ‌ల 118 అనే థ్రిల్ల‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం క‌ళ్యాణ్ రామ్‌కి మంచి విజ‌యాన్ని అందించింది. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ త‌న 17వ చిత్రాన్ని స‌తీష్ వేగేష్న ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఎంత మంచివాడ‌వురా అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంది. ఈ చిత్రంలో మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంతో నిర్మాణ‌రంగంలోకి అడుగుపెడుతుంది . గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుంది. ఎంత మంచి వాడ‌వురా చిత్రం గుజ‌రాతీ హిట్ చిత్రం ఆక్సీజ‌న్‌కి రీమేక్‌గా తెర‌కెక్కుతుంద‌ట‌. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, ఫీల్‌ను మిస్‌ చేయకుండా చాలా చ‌క్క‌గా స‌తీష్ వేగ‌శ్న తెర‌కెక్కిస్తున్నాడని అంటున్నారు. వ‌చ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుద‌ల కానుంది.

2482
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles