ర‌జ‌నీకాంత్ దర్బార్ లోకి ఎంట్రీ ఇచ్చిన చెన్నై భామ‌

Thu,April 25, 2019 10:34 AM

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం దర్బార్. ఇటీవ‌లే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. ముంబైలో చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. రీసెంట్‌గా ఈ చిత్ర షూటింగ్‌లో న‌య‌న‌తార కూడా జాయిన్ అయింది. ఇక చెన్నై భామ నివేదా థామ‌న్ కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, ఆమె కూడా టీంతో జాయిన్ అయిన‌ట్టు తెలుస్తుంది. సినిమాలో ఆమె రజనీకాంత్ కూతురు పాత్రలో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ ‘దళపతి’ సినిమాకు పనిచేసిన సంతోష్ శివన్ 28 ఏళ్ల తర్వాత మళ్లీ ‘దర్బార్’ కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు . లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం చెబుతుంది.

1676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles