త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నివేదా

Fri,June 7, 2019 04:16 PM
Nivetha Pethuraj special role in bunny movie

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం బ‌న్నీ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేటి నుండి రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా చిత్రంలో సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది చిత్ర బృందం. మెంట‌ల్ మ‌దిలో చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతుంది. ప్ర‌స్తుతం నివేదా పేతురాజ్‌ చేతిలోఆరు ప్రాజెక్టుల‌కి పైగా ఉన్నాయి. అల్లు అర్జున్ 19వ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ట‌బు కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైన టాప్ స్టార్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి.

1827
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles