ప్రేమ‌తో.. మీ నివేదా థామ‌స్

Sat,September 23, 2017 03:26 PM
nivetha heartful letter

నివేదా థామ‌స్‌.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌ మ‌న‌సులో ప్రింట్‌లా ముద్రించ‌బ‌డింది. ఈ అమ్మ‌డు న‌టించిన మూడు సినిమాల‌కి మంచి టాక్ రావ‌డంతో నివేదాకి స‌పరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నాని న‌టించిన జెంటిల్‌మెన్ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నివేదా ఆ త‌ర్వాత మ‌రోసారి నాని స‌ర‌స‌న నిన్నుకోరి అనే చిత్రం చేసింది. ఈ చిత్రంలో నివేదా థామ‌స్ న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక తాజాగా జై ల‌వ‌కుశ చిత్రంలో ఎన్టీఆర్‌తో జ‌త‌కట్టింది. గురువారం విడుద‌లైన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. నివేదా ప‌ర్‌ఫార్మెన్స్‌కి కూడా వారు మంచి మార్కులే ఇచ్చారు. ఇలా తాను న‌టించిన మూడు సినిమాల‌ను హిట్ చేసినందుకు నివేదా త‌న ట్విట్ట‌ర్‌లో భావోద్వేగంతో ఓ లెట‌ర్ రాసింది. ఆ లెట‌ర్ కూడ తెలుగులో రాయ‌డం విశేషం.

ఒక సినిమా హిట్ కావడం స్పెషల్. కాని చేసిన మొదటి మూడు సినిమాలని ఇంతగా ఆదరించి, తెలుగు ఇండస్ట్రీలో మా అమ్మాయి అని అక్కున చేర్చుకున్నారు. దీనికన్నా పెద్ద కాంప్లిమెంట్ నాకు మరోటి ఉండదు! దీనిని నేను ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నా అభిమానులకి, నా కుటుంబ సభ్యులకి ఎలా ధన్యవాదాలు చెప్పిన తక్కువే.. జైలవకుశని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో మంచి క్యారెక్టర్‌తో మళ్ళీ కలుస్తాను.. ప్రేమతో మీ నివేదా థామస్ అని రాసింది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. నివేదా ఇంత భావోద్వేగంతో లేఖ రాయడంతో అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు.


2011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS