రిలీజ్ కు రెడీ అవుతున్న నితిన్ మూవీ

Mon,February 5, 2018 10:20 PM
nitin, megha akash Movie to release in april

హైదరాబాద్ : నితిన్, మేఘా ఆకాష్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఒక్క సాంగ్ మినహా పూర్తయింది. శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను అందిస్తున్నాడు. ఎన్. సుధాకర్ రెడ్డి నిర్మాణంలో కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో ఇప్పటివరకు షూటింగ్ జరుపుకుంది.

ఈ విషయమై చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12న చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ సినిమా టీజర్ ను వాలంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న, ఏప్రిల్ 5 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ..ఇది ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం. చాలా సరదాగా సాగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోందన్నారు.

చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి, రోహిణి హట్టంగడి, రావురమేష్, సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్, సంగీతం: థమన్.ఎస్.ఎస్, కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు:శేఖర్, వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ; సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి, నిర్మాత: ఎం.సుధాకర్ రెడ్డి, స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య

2452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles