అబద్ధం తోడులేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట..‘లై’ టీజర్

Tue,July 11, 2017 08:19 PM
nitin lie movie teaser released


హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లై. లవ్ ఇంటెలిజెన్స్ అనేది ట్యాగ్‌లైన్. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. టీజర్‌లో ‘కోట్లమంది సైనికులు సరిపోలేదట..పంచపాండవులూ సాధించలేదట..చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట, అశ్వాత్థామ హత:కుంజర:’ అంటూ సరికొత్తగా ఉన్న డైలాగ్ వెర్షన్ మూవీపై క్యూరియాసిటీని మరింత పెంచేస్తున్నది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో అర్జున్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. మేఘా ఆకాశ్ నితిన్‌కు జోడీగా నటిస్తున్నది.

1234
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles