‘ఎన్టీఆర్’..నిత్యమీనన్ ‘సావిత్రి’ ఫస్ట్ లుక్

Mon,November 5, 2018 08:08 PM
nithyamenon savitri first look from NTR Revealed

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కథానాయకుడు, మహానాయకుడు అనే టైటిళ్లలో రెండు భాగాలుగా బయోపిక్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంలో పలు పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ నుంచి నిత్యమీనన్ ‘సావిత్రి’ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్. పోస్టర్ లో బాలకృష్ణ రోలు రుబ్బుతుండగా..నిత్యమీనన్ అలా చూస్తూ ఉండిపోయింది. తాజా లుక్ లో నిత్యమీనన్ సావిత్రిని మరిచిపోయేలా ఆ పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో గుమ్మడిగా..దర్శకుడు దేవి ప్రసాద్ న‌టిస్తుంటే క్రిష్.. కేవీ రెడ్డిగా, ఎన్ శంకర్.. విఠలాచార్యగా క‌నిపించ‌నున్నారు. యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. చిత్రంలో ఎన్టీఆర్‌గా బాల‌య్య , అక్కినేనిగా సుమంత్‌, హెచ్ ఎం రెడ్డిగా స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీదేవిగా ర‌కుల్ , హ‌రికృష్ణగా క‌ళ్యాణ్ రామ్, బ‌స‌వ‌తార‌కంగా విద్యా బాల‌న్ , చంద్ర‌బాబుగా రానా న‌టిస్తున్నారు.

3478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS