అక్షయ్ కుమార్ చిత్రంలో నిత్యమీనన్

Mon,November 5, 2018 07:14 PM
Nithya menon to debut in Bollywood with akshaykumar

తెలుగులో తొలి సినిమా ‘అలా మొదలైంది’తోనే ఎంతోమంది అభిమానులను సంపాదించింది బెంగళూరు భామ నిత్యమీనన్. గాయనిగా కూడా రాణించి ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన నిత్యమీనన్ ఇపుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది.

మూడు భాషల్లో నటించి పలు అవార్డులను గెలుచుకున్న నిత్యమీనన్..హిందీలో స్టార్ హీరో అక్షయ్‌తో నటించే అవకాశాన్ని కొట్టేసింది. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం మిషన్ మంగల్. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నిత్య హీరోయిన్‌గా ఎంపికైంది. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నిత్యమీనన్ హిందీలో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

2120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles