సమంతని రీప్లేస్ చేయబోతున్న నిత్యా మీనన్ ?

Wed,May 17, 2017 12:43 PM
Nithya Menen replace by samantha in U Turn re make

గ్లామరస్ బ్యూటీ సమంత ప్రస్తుతం రామ్ చరణ్ మూవీతో పాటు రాజు గారి గది సీక్వెల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవే కాకుండా మహానటి, విజయ్ 61వ సినిమాలతో పాటు పలు తమిళ సినిమాలతోను బిజీగా ఉంది సామ్. అయితే ఈ అమ్మడి కలల ప్రాజెక్ట్ యూ టర్న్ ని ఎప్పటి నుండో తెలుగు రీమేక్ చేయాలని భావించింది. కాని పలు కారణాల వలన ఇది వాయిదా పడుతూ వచ్చింది. కాగా ప్రస్తుతం సమంత యూ టర్న్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని ఫిలిం నగర్ సమాచారం. ఇదే చిత్రాన్ని ఓ ప్రముఖ దర్శకుడు తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తుండగా, అందులో కథానాయికగా నిత్యామీనన్ ని సెలక్ట్ చేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. నిత్యా ..కె. ఎస్. రామారావు నిర్మాణంలో రూపొందనున్న సినిమాలోను నటించనుంది. ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు.

1773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles