నిత్యామీన‌న్ 'ప్రాణ' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sat,June 23, 2018 01:26 PM
Nithya Menen Praana First Look very intresting

క‌న్న‌డ చిత్రం సెవ‌న్ ఓ క్లాక్‌తో వెండితెర ఆరంగేట్రం చేసిన నిత్యామీన‌న్ కెరీర్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ వస్తుంది. ఇటీవ‌ల నాని నిర్మించిన అ అనే చిత్రంలో ముఖ్య పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసింది నిత్యా. సౌత్‌లోని ప‌లు భాష‌ల‌లో న‌టిస్తూ వ‌స్తున్న నిత్యా మీన‌న్ ప్ర‌స్తుతం క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది. ప్రాణ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. మేకర్స్ తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. మాలీవుడ్ స్టార్ దుల్క‌ర్ సల్మాన్ చేతుల మీదుగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఇక చిత్రం గురించి ఆసక్తికరమైన విష‌యం ఏమిటంటే ఈ సినిమా మొత్తం ఒకే ఒక్క యాక్ట‌ర్‌తోనే న‌డుస్తుంద‌ట . వీకే ప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వంలో థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఇండియా టాప్ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు. ఫ‌స్ట్ లుక్‌తోనే భారీ అంచ‌నాలు పెంచిన టీం సినిమాతో రికార్డులు కొల్ల‌గొట్ట‌నున్నార‌ని అంటున్నారు. లూయిజ్ బ్యాంక్స్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


1673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS