వెబ్ సిరీస్ లో నటించనున్న హీరోయిన్

Sun,November 18, 2018 03:47 PM
Nithya menen Heroine plans to Web series soon

కోలీవుడ్ హీరోయిన్ నిత్యమీనన్ హిందీలో అక్షయ్ కుమార్ తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన ఈ భామ హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమైంది. వీటితోపాటు తాజాగా వెబ్ సిరీస్ కు కూడా ప్లాన్ చేస్తోందట నిత్య. ఈ విషయాన్ని నిత్యమీనన్ ఇటీవలే ఓ ఇంటర్క్యూలో వెల్లడించింది. వెబ్ సిరీస్ లో తాను ముఖ్యమైన పాత్రలో కనిపిస్తానని చెప్పింది. అయితే వెబ్ సిరీస్ ఏ భాషలో ప్రేక్షకుల ముందుకు రానుందనే విషయం మాత్రం నిత్యమీనన్ చెప్పలేదు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ లో నిత్యమీనన్ నటించనుంది.

1757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles