ప‌దేళ్ళ త‌ర్వాత బాలీవుడ్‌కి హాయ్ చెబుతున్న నిత్యా

Sun,October 14, 2018 07:52 AM
Nithya Menen enter into bollywood

బాలీవుడ్‌లో సినిమా చేయాల‌నేది కొంద‌రి క‌ల‌. అందుకోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన అవి ఫ‌లించ‌వు. మ‌ల‌యాళ బ్యూటీ నిత్యామీన‌న్ ఇండ‌స్ట్రీకి వచ్చి ప‌దేళ్ళు అయిన ఇప్ప‌టి వ‌ర‌కు ఓ బాలీవుడ్ సినిమా చేయ‌లేక‌పోయింది. దక్షిణాదిలో ప‌లు బాష‌ల‌లో న‌టించిన నిత్యామీన‌న్ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి ప‌ల‌క‌రించాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటుంది. ప‌దేళ్ల త‌ర్వాత ఆమె కోరిక తీరింది. నిత్యా తాజాగా ప్రాణ అనే సినిమా చేస్తుంది. ఏకకాలంలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. కేవలం ఒకే ఒక్క పాత్రతో వీకే ప్రకాశ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సామాజిక సమస్యలపై పోరాడే రచయిత్రిగా నిత్య కనిపించనున్నారు. ‘ప్రాణ’ చిత్రం హిందీలో కూడా రిలీజ్‌ అవ్వబోతోంది. హిందీలో ఇదే నా ఫస్ట్‌ సినిమా అవ్వనుంది అంటూ ప్రాణ మూవీ హిందీ పోస్టర్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న ఆనందం తెలియ‌జేసింది. థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఇండియా టాప్ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు. లూయిజ్ బ్యాంక్స్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ‘ప్రాణ’ చిత్రం రిలీజ్‌ కానుంది.2589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles