హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో మరోసారి..

Mon,March 18, 2019 05:25 PM
Nithin to team up with Vijaykumar konda Again?


గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో నితిన్ కు చాలా కాలం విరామం తర్వాత మంచి హిట్ అందించాడు డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ. 2013లో వచ్చిన ఈ చిత్రం విజయ్ కుమార్ కు మొదటి సినిమా. కాగా ఈ సినిమా బాక్సాపీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి విజయ్ కుమార్ తీసిన 'ఒక లైలా కోసం' చిత్రం ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఇప్పటివరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు ఈ డైరెక్టర్.

అయితే తాజాగా ఈ దర్శకుడు నితిన్ తో కలిసి ఓ ప్రాజెక్టును తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. విజయ్ కుమార్ ఇటీవలే నితిన్ కు ప్రేమకథ నేపథ్యంలో రాసుకున్న స్టోరీలైన్ ను వినిపించగా..దీనికి నితిన్ ఒకే చేసినట్లు వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో విజయ్ కుమార్ కొండతో కలిసి తీయనున్న చిత్రానికి సంబంధించి నితిన్అధికారికంగా ప్రకటన వెలువరించనున్నట్లు సమాచారం.

1813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles