ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడి త‌ర్వాతి చిత్రం ఎవ‌రితో..?

Wed,July 18, 2018 01:09 PM
nithin second movie hero fixed

ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ఆర్ ఎక్స్ 100. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా పనిచేసిన అజ‌య్ భూప‌తి ఆర్ ఎక్స్ 100 అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అయ్యాడు. మొద‌టి చిత్రంతోనే త‌న ప్ర‌తిభ‌ను చూపించి అంద‌ర‌కు అవాక్క‌య్యేలా చేశాడు. జూలై 12న విడుద‌లైన ఆర్ ఎక్స్ 100 చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. చిత్రంలో హీరో హీరోయిన్‌ల మ‌ధ్య రొమాన్స్ యువ‌తకి బాగా క‌నెక్ట్ అయ్యేలా తెర‌కెక్కించి స‌ఫ‌లం అయ్యాడు ద‌ర్శ‌కుడు . ముఖ్యంగా హీరోయిన్ పాయ‌ల్ రాజ్ ఒకవైపు కోరిక‌తో ర‌గిలిపోతూ, లోలోప‌ల కుట్ర‌లు చేయ‌డాన్ని అద్భుతంగా చూపించి సినీ ప్రేక్ష‌క‌లోకానికి థ్రిల్‌ని క‌లిగించాడు. ఇప్పుడు ఆయన రెండో సినిమా ఏంటా అని అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది.

తొలి సినిమానే అద్భుతంగా తెర‌కెక్కించిన అజ‌య్ భూప‌తికి ప‌లు ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ల నుండి భారీ ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. రీసెంట్‌గా హీరో నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి.. అజ‌య్ భూప‌తిని క‌లిసి ప‌లు చ‌ర్చ‌లు జరిపారు. ఈ నేప‌థ్యంలో అజ‌య్ త‌న త‌ర్వాతి చిత్రాన్ని నితిన్‌తో చేసేందుకు సుముఖంగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా 'శ్రీనివాస కల్యాణం' మూవీని పూర్తిచేసిన నితిన్ అతి త్వ‌ర‌లోనే వెంకీ కుడుములతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఈ మూవీ త‌ర్వాత అజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. ఆ లోపు భూప‌తి త‌న సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసుకోనున్నాడు .

అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన ఆర్ ఎక్స్ 100 చిత్రం భారీ వ‌సూళ్ళ‌తో దూసుకెళుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 10 కోట్లు రాబ‌ట్టిన ఈ చిత్రంపై ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ ప్ర‌శంస‌లు కురిపించారు. నితిన్ కూడా ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేశాడు. ఎంతో రియ‌లిస్టిక్‌గా అదిరిపోయే ట్విస్ట్‌ల‌తో అద్భుతంగా ఈ సినిమా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. చిత్ర డైరెక్టర్ అజయ్ భూపతి గారికి అలాగే హీరో కార్తికేయ మరియు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో పాటు చిత్ర యూనిట్ అందరికి ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారు.


2887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles