త‌మిళ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచ‌న‌లో నితిన్‌

Wed,December 19, 2018 11:39 AM
nithin remakes tamil movie

త‌మిళ చిత్రాల‌ని రీమేక్ చేసి మంచి విజ‌యాల‌ని సాధించ‌డం మ‌న హీరోల‌కి ఆన‌వాయితీగా మారింది.నితిన్ ఇటీవ‌ల న‌టించిన ‘లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలు పరాజయాన్ని మిగల్చ‌డంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు నితిన్‌. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్ త‌మిళ సూప‌ర్ హిట్ రీమేక్‌లో న‌టించేందుకు కూడా సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. ర‌ట్సాస‌న్ అనే త‌మిళ చిత్రం ఈ ఏడాది ఇండియాలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రాల‌లో రెండ‌వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం తెలుగు హ‌క్కుల‌ని నితిన్ ద‌క్కించుకున్నాడ‌ని తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. రెండు ప్రాజెక్టుల‌లో ఏ చిత్రాన్ని నితిన్ సెట్స్ పైకి తీసుకెళ‌తాడో చూడాలి.

981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles