మదర్ ప్రమోషన్ అందుకోబోతున్న మాజీ హీరోయిన్!

Tue,September 19, 2017 03:04 PM
Nisha Agarwal to be mother in future

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ త్వరలో తల్లి కాబోతుందనే వార్త ప్రస్తుతం అంతటా చక్కర్లు కొడుతుంది. ఏమైంది ఈ వేళ, సోలో సినిమాలతో తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకున్న నిషా ఆ తర్వాత సరైన హిట్స్ సాధించలేకపోయింది. దీంతో పెళ్లి పీటలెక్కింది. ముంబైకి చెందిన వ్యాపార వేత్తని పెళ్ళి చేసుకున్న నిషా అప్ప‌టి నుండి సినిమాలకు పూర్తిగా దూరమైంది. వీరి వివాహం జరిగి దాదాపు నాలుగు సంవత్సరాలు కావొస్తుండగా, ప్రస్తుతం నిషా ప్రగ్నెంట్‌గా ఉందనే టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని కాజల్ కుటుంబం కూడా ధృవీకరించినట్టు సమాచారం.1840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles