కొత్త భామని పట్టుకొస్తున్న అల్లరోడు

Sat,March 11, 2017 09:17 AM
nikhila vimal debut to tollywood

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి కొత్త భామల తాకిడి ఎక్కువ అయింది. తమిళం,మలయాళంలో నటిస్తున్న భామలు తెలుగులోను తమ సత్తా చూపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో మన దర్శక నిర్మాతలు టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్త కథానాయికలని పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం మరో భామ తెలుగు తెరకు పరిచయం కానుంది. కొద్ది రోజులుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న అల్లరోడు ఒరు వడక్కన్ సెల్ఫీ అనే మలయాళ సినిమాను ప్రజీత్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నిఖిలా విమల్ ను తీసుకున్నారు. ఈ భామ తన అంద చందాలతో పాటు నటనతోను టాలీవుడ్ ఆడియన్స్ ని కట్టిపడేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

2224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles