‘కుమారి 21ఎఫ్’ డైరెక్టర్‌తో నిఖిల్

Tue,December 3, 2019 06:43 PM


ఇటీవలే అర్జున్ సురవరం చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కుర్రహీరో నిఖిల్ సిద్దార్థ. టీఎన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్‌జోష్ మీదున్న నిఖిల్ తన కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపాడు. కుమారి 21ఎఫ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రకాక్ దర్శకత్వంలో నిఖిల్ సినిమా చేయనున్నాడు. గీతాఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి.


టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. బన్నీవాసు నిర్మాత. సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు టాక్. దీనికి సంబంధించిన నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనుంది చిత్రయూనిట్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నటించే అవకాశం గొప్ప, అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు నిఖిల్ ట్వీట్ చేశాడు.

703
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles