న‌ట‌న‌కి గుడ్‌బై చెప్పిన నిహారిక ..!

Tue,July 9, 2019 12:07 PM

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు గారాల ప‌ట్టి నిహారిక తొలిసారి పలు వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ త‌ర్వాత‌ ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి చిత్రం ఈ అమ్మ‌డికి నిరాశ‌నే మిగిల్చింది. ఆ త‌ర్వాత హ్య‌పీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది నిహారిక‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఇక రీసెంట్‌గా విడుద‌లైన సూర్య‌కాంతం చిత్రం కూడా నిహారికకి స‌క్సెస్‌ని అందించ‌లేకపోయింది. ఈ నేప‌థ్యంలో నిహారిక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక న‌ట‌నకి గుడ్‌బై చెప్పి నిర్మాతగా మంచి సినిమాలు చేయాల‌ని నిహారిక భావిస్తుంద‌ట‌. ఇప్పటికే త‌న సొంత బేన‌ర్ పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బేన‌ర్‌పై నిహారిక ప‌లు వెబ్ సిరీస్‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇదే బేన‌ర్‌పై సినిమాలు కూడా చేయాల‌ని ఈ మెగా హీరోయిన్ అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. తన తొలి సినిమా మెగా హీరోతోనే ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీలో ఓ టాక్ వినిపిస్తుంది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

7691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles