'స్త్రీ' రీమేక్‌లో మెగా హీరోయిన్..!

Wed,September 26, 2018 01:09 PM
Niharika Konidela in Stree Remake

మంచి కంటెంట్ ఉన్న బాలీవుడ్ చిత్రాలు తెలుగులో రీమేక్ అవుతుండ‌డం స‌హజం. ఇటీవ‌ల రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధాకపూర్ జంటగా వ‌చ్చిన స్త్రీ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. హ‌ర‌ర్ కామెడీగా తెర‌కెక్కిన ఈ చిత్రం బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఓ స్త్రీ రేపు రా అని ప్రతి ఇంటి ముందు రాసి ఉంటుంది. రాత్రి పూట ఓ ఆడ దయ్యం వచ్చి యువ‌కుల‌ను ఎత్తుకెళ్లుతుందన్న భయం ఆ ఊళ్లో ఉంటోంది. 1980 దశకంలో ఇలాంటి సందర్భాలు కొన్ని రాష్ట్రాల‌లో ఎదురయ్యాయి. అయితే ఆ కథాంశంతో స్త్రీ సినిమాను తెరకెక్కించారు. అమర్ కౌషిక్ ఈ సినిమాను డైరక్ట్ చేశాడు. తెలుగు నిర్మాత‌లు రాజ్‌, డీకే సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.

రీసెంట్‌గా మీడియాతో మాట్లాడిన నిర్మాత‌లు తెలుగులో సినిమాని తెర‌కెక్కించేందుకు స‌రైన ద‌ర్శ‌కుడిని ఎంపిక చేసేప‌నిలో ఉన్నామ‌ని అన్నారు. తిరుప‌తిలో చిత్రానికి సంబంధించి మేజ‌ర్ పార్ట్ షూటింగ్ చేయాల‌ని భావించిన‌ట్టు తెలిపారు. ఇక చిత్రంలో రాజ్ కుమార్ రావు పాత్ర‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని అనుకుంటుండ‌గా, శ్ర‌ద్ధా క‌పూర్ పాత్ర కోసం నిహారిక‌ని ఎంపిక చేయాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్నారు. విజ‌య్ న‌టించిన నోటా చిత్రం అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌కి సిద్ధం కాగా, నిహారిక త‌న పెద్ద‌నాన్న చిరు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన సైరా చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.కథాక‌ళి డ్యాన్స‌ర్‌గా నిహారిక క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు.

2670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS